ఎంపీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..
ఎంపిక బాధ్యత అధిష్టానందే
ఫీజు ఎంత అంటే..
స్పాట్ వాయిస్, బ్యూరో : లోక్సభ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను హై కమాండ్కి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి పరిశీలకులను నియమించిందన్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు.కాంగ్రెస్ ఎన్నికల కమిటీతో సమావేశమైన అనంతరం.. ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దరఖాస్తుల స్ర్కూటిని కోసం ప్రత్యేక కమిటీని వేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఎవరికీ ఎంత అంటే..
ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైందని.. మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. జనరల్ స్థానాలకు దరఖాస్తు ఫీజు రూ.50 వేలు.. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు దరఖాస్తు ఫీజు రూ.25 వేలు ఉంటుందని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లేందుకు తాము ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లి సభ నుంచి లోక్సభ శంఖారావం పూరిస్తున్నామన్నారు.
Recent Comments