Saturday, November 23, 2024
Homeతెలంగాణకొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎలాంటివి చేపట్టొద్దని ఆదేశాలు

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం..

స్పాట్ వాయిస్, హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎన్నికలైన ఎమ్మెల్సీలు కోదండరాం, అమీరుల్లా ఖాన్‌ ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణలో గవర్నర్​ కోటా ఎమ్మెల్సీలుగా ఇటీవల కోదండరాం; అమీరుల్లాఖాన్ ఎన్నికకాగా, ప్రభుత్వం కూడా వారు ఎన్నిక విషయమై ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రావణ్‌, సత్యనారాయణ హైకోర్టులో ఫిటిషన్​ వేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లాఖాన్‌ను ఎమ్మెల్సీలుగా ప్రతిపాధించగా గవర్నర్ తమిళిసై కూడా ఆమోదించారు. ఈ క్రమంలో నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అమీరుల్లాఖాన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు శాసనమండలి కార్యాలయానికి వెళ్లారు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అనారోగ్య కారణాలతో అందుబాటులో లేరు. అయితే ఈ నెల 30 తేదీ ఉదయం ప్రమాణం చేసేందుకు వీలు కల్పించాలని మండలి కార్యదర్శికి లిఖిత పూర్వకంగా కోరారు. ఈ నెల 31న కొత్తగా ఎంపికైన నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పెట్టుకుంటామని సుఖేందర్ పేర్కొన్నారు .అయితే ఈ లోగా విచారణ అనంతరం హైకోర్టు ఎమ్మెల్సీలు కోదండరాం, అమీరుల్లా ఖాన్‌ ప్రమాణ స్వీకారాన్ని 14 రోజులు నిలిపేవేయడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది..

RELATED ARTICLES

Most Popular

Recent Comments