Monday, May 26, 2025
Homeజిల్లా వార్తలుపెద్ది ఇలాఖాలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్

పెద్ది ఇలాఖాలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్

యూత్ కన్వీనర్ రాణా ప్రతాప్ రాజీనామా
ఇప్పటికే గుడ్ బై చెప్పిన వైస్ చైర్మన్ సహా 14 మంది కౌన్సిలర్లు
స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే వైస్ చైర్మన్ సహా 14 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడగా.. నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ కన్వీనర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మంగళవారం పార్టీ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. పార్టీలో ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు నచ్చక రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన పెద్ది సుదర్శన్ రెడ్డికి, తనకు సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments