ఎమ్మెల్సీ కోదండరాంను విమర్శించే స్థాయి కేటీఆర్ ది కాదు..
జన సమితి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం కు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యతిరేకించడం అవివేకమని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సార్ గురించి కేటీఆర్ అవివేకంగా మాట్లాడం తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పది సంవత్సరాలు బీ ఆర్ఎస్ అధికారంలో ఉన్న ఆయన్ను ఇబ్బందులకు గురి చేసారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కోదండరాంను మీరు ఎందుకు గుర్తించలేదని అన్నారు. వాస్తవానికి వస్తే కోదండరాం లేనిదే మీ అయ్యా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ సారధి ని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావీద్ ఎండి సందాని, బీగుంటి సంజీవ, సాంబరాతి మల్లేశం, సోల్తి సాయికుమార్, మహమ్మద్ నుమాన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments