Tuesday, November 26, 2024
Homeతెలంగాణతెల్ల రేషన్‌కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ..

తెల్ల రేషన్‌కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ..

తెల్ల రేషన్‌కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ..

అందరికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డు ఇవ్వండి..

సీఎం రేవంత్‌రెడ్డి

స్పాట్ వాయిస్, బ్యూరో: ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులను అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుకు ఒక విశిష్ట సంఖ్యను కేటాయించాలని, దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్డులతో ఆరోగ్యశ్రీ సేవలను అనుసంధానించాలని సూచించారు. సోమవారం ఆయన సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ కార్డుకోసం తెల్ల రేషన్‌కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. వైద్య కళాశాల ఉన్న చోటనర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అందుకోసం ఓ సంయుక్త విధానాన్ని తీసుకురావాలన్నారు. వైద్య కళాశాలల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగాలని, వరంగల్‌, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లోని టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments