మా పార్టీ అందుకే ఓడిపోయిoది..
ఆ పథకాలే కొంప ముంచాయ్..
నేను కొన్ని తప్పులు చేశా..
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్..
స్పాట్ వాయిస్, తొర్రూర్: అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి దళిత బంధు, గిరిజన బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు సక్రమంగా ఇవ్వకపోవడమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సొంత పార్టీ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పాలకుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బంధు పథకం పద్ధతిగా ఇచ్చి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దళిత బంధు పథకంతోనే గిరిజన బంధు ఇవ్వాలని కొందరు, అలాగే బీసీ బంధు ఇవ్వాలని మరికొందరు ముందుకు రావడం వల్ల.. బీ ఆర్ ఎస్ సర్కార్ పై వ్యతిరేకత ఏర్పడిందని చెప్పారు.
ఇండ్లు ఇస్తే బాగుండు…
మూడేళ్ల క్రితమే డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేస్తే బాగుండేదని, పరిస్థితులు మరోలా ఉండేవని అభిప్రాయపడ్డారు. కానీ.. ఎన్నికల ముందు పంపిణీ చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో, అలాగే నాయకత్వ నిర్ణయాల్లో లోపాలున్న మాట వాస్తవమేనని చెప్పారు. తాను కూడా కొన్ని తప్పులు చేశానని ఒప్పుకున్నారు. అయితే.. ప్రజలకు తాము సంక్షేమ పథకాలన్నీ అందించామని, అందుకు ప్రజలు ఆదరించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
Recent Comments