రేషన్ కార్డు ఈకేవైసీ గడువు పెంపు
ఎప్పటి వరకంటే..
స్పాట్ వాయిస్, హన్మకొండ: రేషన్ కార్డు ఈకేవైసీ గడువుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో… ఈ సమయాన్ని ఫిబ్రవరి చివరి వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్రం… ఫిబ్రవరి నెలాఖరు వరకు సమయాన్ని పెంచింది. ప్రస్తుతం తెలంగాణలోను రేషన్ కార్డుల ఈ-కేవైసీ 75.76 శాతం పూర్తి అయింది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా వంద శాతం పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు.
Recent Comments