మంత్రి కొండా సురేఖను కలిసిన కొమురవెళ్లి ఆలయ కమిటీ
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : చేర్యాల కొమురవెల్లి దేవాలయ కమిటీ నియామకం అయిన సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తోపాటు జనగామ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కమిటీ చైర్మన్, సభ్యులు శనివారం హైదరాబాద్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు అల్లం శ్రీనివాస్, ముస్త్యాల దామోదర్, తాళ్లపల్లి రమేష్, లింగంపల్లి శ్రీనివాస్, మేడికుంట శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు మహాదేవుని శ్రీనివాస్ మంత్రి కొండా సురేఖ, కొమ్మూరికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కొమురవెల్లి జాతర సందర్భంగా పార్కింగ్ ప్రదేశాల నుంచి ఆలయం వరకు ఎలక్ట్రిక్ ఆటోలు ఏర్పాటు చేయాలని మంత్రి కొండా సురేఖను కోరామన్నారు. త్వరలోనే దాతల సహకారంతో 120 గదుల సముదాయం నిర్మించేందుకు కొమ్మూరి ప్రతాపరెడ్డి సూచనలతో దేవాదాయ శాఖ మంత్రికి విన్నవించామని, అయితే మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్పందించారన్నారు. కొమురవెళ్లి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయిస్తామని చెప్పారన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారన్నారు.
మంత్రి కొండా సురేఖను కలిసిన కొమురవెళ్లి ఆలయ కమిటీ
RELATED ARTICLES
Recent Comments