- స్పాట్ వాయిస్, మహబూబాబాద్ (డోర్నకల్): అక్రమ బాంబ్ బ్లాస్టింగ్ కేసులో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నున్న రమణను శుక్రవారం ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం పోలీసులు అరెస్టు చేశారు. కూసుమంచి సీఐ జితేందర్ కథనం ప్రకారం.. తిరుమలాయపాలెం మండల పరిధిలో మూడేళ్ల క్రితం రమణ తన వెంచర్‌లో అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేశారు. ఈ ఘటనపై నమోదైన కేసులో రమణను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో సదరు బీఆర్ఎస్ నాయకుడి బాగోతాలు ఒక్కొక్కటిగా బట్టబయలు అవుతున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recent Comments