Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుతెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ కు సన్మానం

తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ కు సన్మానం

తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ కు ఘన సన్మానం

 

స్పాట్ వాయిస్, గణపురం: విశ్రాంత ఉద్యోగులు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్ఆర్) అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ భవనంలో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో జీఎస్ఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పాటు భూపాలపల్లిలో తాను అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు విశ్రాంత ఉద్యోగులు చేసిన సహకారం మరువలేనిది అన్నారు. పెన్షనర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ కొరకు భవనం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బోనాల రాజమౌళి పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువా, మెమెంటో, పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జనగం కరుణాకర్ రావు, వరుణకుమారి, విశ్రాంత ఉద్యోగులు, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments