Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్ప్రభుత్వ సలహాదారుల నియామకం

ప్రభుత్వ సలహాదారుల నియామకం

ప్రభుత్వ సలహాదారుల నియమాకం..

స్పాట్ వాయిస్, బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ నేత హర్కర వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢీల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించింది. ఈ నలుగురికీ కేబినెట్‌ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్‌ అలీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రొటోకాల్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ సలహాదారుగా వేణుగోపాల్‌గా వ్యవహరించనున్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల మహేశ్‌కుమార్‌ గౌడ్, బల్మూరి వెంకట్‌లకు ఎమ్మెల్సీ అభ్యర్థులగా అవకాశం కల్పించింది. ప్రభుత్వ సలహాదారుల నియామకం ద్వారా నలుగురు కీలక నేతలకు అవకాశం కల్పించింది. ఆర్టీసీ ఛైర్మన్‌ సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌ పర్యటన పూర్తై హైదరాబాద్‌ వచ్చాక వాటిపై స్పష్టత రానుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments