స్పాట్ వాయిస్, క్రైం: అనుమానం.. నూరేళ్ల సంసారంలో నిప్పులు పోసింది. భార్య తల నరికి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వినయ్ అనే వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తలను నరికేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల, మొండెంను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Recent Comments