Sunday, November 24, 2024
Homeతెలంగాణఐలోనిలో ఏర్పాట్లు శూన్యం

ఐలోనిలో ఏర్పాట్లు శూన్యం

ఐలోనిలో ఏర్పాట్లు శూన్యం

ఇబ్బంది పడుతున్న భక్తులు

స్పాట్ వాయిస్,  హన్మకొండ రూరల్: ఐనవోలు మల్లిఖార్జున స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. దేవాలయ పాలకవర్గం,పలు శాఖల అధికారులు తూతూ మంత్రంగా ఏర్పాట్లను చేసారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వీఐపి లకు మాత్రమే రెడ్ కార్పొరేట్ వేసి సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదంటున్నారు. వివిఐపీ దర్శనం కోసం ఒక టికెట్ కు 500 రూపాయలు తీసుకొని ఇద్దరికి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. సామాన్య భక్తులు మాత్రం స్వామి వారి దర్శనం కోసం గంటలకొద్దీ లైన్ లో వెయిట్ చేస్తు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్ లో ఉన్న భక్తులకు కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యంలేదు.ఆలయ ఆవరణలో బోనాలు చేసుకునే భక్తులకు నీటి సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. గుడి చుట్టూ ప్రాంతంలో ఎక్కడ కూడా తాగునీటి నల్లాలు గాని, పంపు సెట్లుగాని ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యనికి అద్దం పడుతోంది. దేవాలయ సిబ్బంది, పాలకవర్గం విఐపి లను చూసి హడావిడి చేయడం తప్ప మరి ఏమీ లేదoటున్నారు. జాతరకు ముందు రివ్యూ మీటింగ్ లో మంత్రి స్వయంగా జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చాలని చెప్పినప్పటికీ,అన్ని శాఖల అధికారులు హడావిడి తప్ప పనిచేసినట్లు మాత్రం కనిపియట్లేదని భక్తులు అనుకుంటున్నారు. భక్తులకు ఆలయ ఆవరణలో విశ్రాంతి కోసం ఏర్పాటుచేసిన గదులకు సున్నాలు మాత్రమే వేసి, లోపల చెత్తాచెదారం ఉండడంతో దుర్గంధంతో దుర్వాసన వస్తుంది. గదులలో నీటి వసతి లేక పోవటంతో ఆ రూములు ఉపయోగ కారంగా లేకుండా పోయాయి.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments