స్నేహితురాలికి ఆపన్నహస్తం
జడ్పీహెచ్ ఎస్ చందుపట్ల పూర్వ విద్యార్థుల ఔదార్యం.
స్పాట్ వాయిస్, నకిరేకల్: కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్నేహితురాలికి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు నకిరేకల్ మండలం చందుపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. ఇదే బ్యాచ్ కు చెందిన దుస్స పరమేశ్వరికి 20 ఏళ్ల క్రితం నకిరేకల్ లోని పన్నాలగూడెం గ్రామానికి చెందిన ముషం భద్రయ్యతో వివాహమైంది. వారికి ఒక కుమార్తె జన్మించింది. కాగా, ఐదేళ్ల క్రితం పరమేశ్వరి భర్త భద్రయ్య మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి పరమేశ్వరి తన కుమార్తెతో తన తల్లి భారతమ్మతో ఉంటుంది. భారతమ్మకు వృద్దాప్యం మీద పడడంతో ప్రస్తుతం పరమేశ్వరి మాత్రమే టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుoది. ఆమెకు దివ్యాంగురాలైన సోదరి ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పరమేశ్వరి స్నేహితులు ఆదివారం ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమెకు మానసికంగా ధైర్యం చెప్పి ఆపన్నహస్తం అందించారు. రూ. 28,500/- ఆర్ధికసాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అల్లి సైదులు, కోట్ల సాగర్, జిల్లా కరుణాకర్, ఎం. రమాదేవి, ఎన్. స్వప్న, సునీత, సొల్లేటి ఉపేంద్రాచారి, గొడ్డెటి పురుషోత్తం, గంజి శంకర్, సీహెచ్. సైదులు, తవిడబోయిన సైదులు, గుండాల వెంకన్న, వడ్డెబోయిన సైదులు, శైలజారాణి, గాదె శ్రీను, కే. వెంకన్న, పిల్లి సోమయ్య, వేణుమాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Recent Comments