Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలుక్రీడలతో మానసికోల్లాసం..

క్రీడలతో మానసికోల్లాసం..

క్రీడలతో మానసిక ఉల్లాసం

వ్యాపారవేత భూక్య శ్రీకాంత్

స్పాట్ వాయిస్, మహబూబాబాద్: క్రీడలు మానసిక ఉల్లాసానికి పెంపొందించడమే కాక మనిషికి, మనిషికి మధ్య ప్రేమానురాగాలు పెంచుతాయని ప్రముఖ వ్యాపారవేత్త భూక్య శ్రీకాంత్ అన్నారు.మంగళవారం బోడ హట్య తండ యువ క్రికెట్ క్రీడాకారులకు 20 జెర్సీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారితో మరణించిన దారావత్ బాలకృష్ణ జ్ఞాపకార్థం టీ షర్ట్స్ అందజేసినట్లు తెలిపారు.క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి, క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి స్నేహపూర్వకంగా ఆడుకోవాలని అన్నారు. గెలిచినవారు ఓడిన వారిని.. హేళన చేయకుండా స్నేహ పూర్వకంగా క్రీడా స్ఫూర్తితో మెలగాలని, అదే విధంగా నిర్వాహకులు క్రీడాకారులకు సహకరించాలని సూచించారు. అంతేకాకుండా క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా యువత దృఢంగా తయారవుతారని తెలిపారు. కీ”శే”బాలకృష్ణ ఆశయాలు నెరవేర్చుటకు ప్రతి ఒక్కరం కంకణ బద్ధులమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో వార్డు మెంబర్ ధరవత్ సీతారాం, దారవత్ రాందాస్, యువ నాయకులు బో డ రమేష్,భూక్యా సేవలాల్,క్రీడాకారులు మూడ్ శ్రీను,భూక్యా సతీష్, డి ప్రసాద్,కుమార్,సతీష్, నౌషత్,గోవర్ధన్,తరుణ్ తదితరులున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments