గృహలక్ష్మి రద్దు..
ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
స్పాట్ వాయిస్, బ్యూరో: బీ ఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి సొంతింటి పథకాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద బెనిఫిషియరీ లెడ్ కన్‌స్ట్రక్షన్ (బీఎల్‌సీ) మోడ్‌లో ఇచ్చే రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. మొత్తం నాలుగు లక్షల ఇండ్లకు అప్పటి ప్రభుత్వం మొదటి విడతలో 2,12,095 మందికి ఇండ్లు మంజూరు చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం అభయహస్తంలో ఇళ్లు లేని పేదలు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకంలో భాగంగా రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తుండటంతో ‘గృహలక్ష్మి’ పథకాన్ని నిలిపివేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
Recent Comments