సద్ది బువ్వ తిన్న దామెర ఎస్సై
స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని ల్యాదేల్ల గ్రామం నుంచి దమ్మన్న పేట గ్రామం వెళ్ళే దారిలో విధుల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై కొంక అశోక్ రహదారి పక్కనే ఉన్న చేనులో పత్తి ఏరుతున్న రైతు కూలీలతో కాసేపు ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్న అనంతరం మహిళా కూలీలు వారు తింటున్న సద్దుల లోని భోజనాన్ని ఎస్సైకి పెట్టగా ఆనందంతో భోజనం చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎస్సై అశోక్ తన కుటుంబ నేపథ్యం, చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తాను చదువుకునే సమయంలో పొ లం పనులకి వెళ్లి ఇలా తినేవాడినని,చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్న పోలీస్ స్టేషన్ లో అందుబాటులో ఉంటానని, తనను సంప్రదించండని ఆయన వారికి హామీ ఇచ్చారు.
Recent Comments