పోలీసుల అదుపులో 14 మంది
స్పాట్ వాయిస్, బ్యూరో: బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బిగ్‌బాస్ ఫైనల్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ధ్వంసం, దాడి ఘటనలో ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు మహావీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నెల 17న బిగ్‌బాస్ ఫైనల్ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటికి రాగా, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ సైతం బయటకు రాగా, ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అనుదీప్ కారుపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. మరో పోటీదారు అశ్విని కారు అద్దాలను పగులగొట్టారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతోపాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని పగులగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ప్రశాంత్, ఏ2గా మనోహర్, ఏ3గా అతడి స్నేహిడుతు వినయ్‌ను చేర్చారు. ఇప్పటికే ఏ4గా ఉప్పల్‌కు చెందిన సాయికిరణ్, అంకిరావుపల్లి రాజును అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ప్రశాంత్, మనోహర్‌తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
చర్లపల్లి జైలుకు బిగ్‌బాస్-7 విజేత
RELATED ARTICLES
Recent Comments