అనుమానిత కేసుగా అడ్మిట్
టెస్టులకు పంపిన వైద్యులు
నిలకడగానే ఆరోగ్యం..
ఆందోళన అవసరం లేదన్న సూపరింటెండెంట్
బాధితురాలిది భూపాలపల్లి జిల్లా గాంధీనగర్
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా కేసులు నమోదయ్యాయన్న పుకార్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధురాలు ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం అడ్మిట్ అయినట్లు తెలిపారు. అయితే నాలుగు రోజులుగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ఓ ప్రైవేటు ల్యాబ్ నుంచి కొవిడ్ పాజిటివ్ రిపోర్ట్ తీసుకొచ్చిందని వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన తాము ఆమెను ఐసోలేట్ చేసి కొవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, సిటీ స్కాన్ తీయగా నార్మల్ రిజల్ట్ వచ్చిందన్నారు. అయినప్పటికీ ఆమెను అనుమానిత కేసు నమోదుగా చేసి చికిత్స అందిస్తున్నామన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీకి ఆర్టీపీసీఆర్ టెస్టులకు సైతం పంపామని, శుక్రవారం మధ్యాహ్నం రిపోర్టు వస్తుందని చెప్పారు. ఆమె ఎలాంటి ట్రావెల్ చేయలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూపరింటెండెంట్ తెలిపారు. అయితే బాధితురాలికి ఆస్తమా కూడా ఉండడం వల్ల ప్రస్తుతానికి జాగ్రత్తగా ఇంటెన్సివ్ కేర్ లో ట్రీట్మెంట్ అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే చలికాలం వచ్చే ఫ్లూ వల్ల సమస్య ఏర్పడుతోందన్నారు. అలాంటి వాటినన్నింటినీ కరోనాగా భావించొద్దని, అలా అని నిర్లక్ష్యం కూడా చేయొద్దని సూచించారు. ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ, కరోనా జేఎన్-1 లక్షణాలు ఉన్న వారు గానీ నమోదు కాలేదని స్పష్టం చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను అనుసరించి 50 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ వెల్లడించారు.
ఎంజీఎంలో కరోనా హైరానా
RELATED ARTICLES
Recent Comments