స్పాట్ వాయిస్, నర్సంపేట : పాకాల చెరువు ఆయకట్టుకు రబీ సాగుకు తైబందీ ఖరారైంది. సోమవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు, ఆయకట్టు రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు పాకాల సరస్సు ఆయకట్టుకు పూర్తి స్థాయి సాగునీరును అందించేందుకు తైబందీని ఖరారు చేశారు. ప్రస్తుతం పాకాల సరస్సులో ఉన్న 22.9 ఫీట్ల నీటితో పాటు దేవాదుల పైప్ లైన్ ద్వారా పాకాల సరస్సులోకి నీటిని పంపింగ్ చేసి పూర్తిస్థాయిలో సాగునీటిని అందజేస్తామన్నారు. పాకాల సరస్సు కింద ఉన్న ఐదు ప్రధాన కాలువైన సంగెం, జాలుబంధం, తుంగభంధం, పసునూరు మాటు వీరారం కాలువల ద్వారా పూర్తిస్థాయిలో ఆయకట్టు రైతులకు సాగు నీరందించేందుకు నిర్ణయించడం జరిగింది.
Recent Comments