నూతన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : గత ఏడాదిన్నరగా టీఎస్పీఎస్సీలో పేపర్ల లీక్‌లు, ఆపై పరీక్షల వాయిదాల వ్యవహారంతో తెలంగాణ లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ రీ షెడ్యూల్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో టీఎస్ పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణ వంటి కీలక అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా టీఎస్ పీఎస్సీ పరీక్షలన్నీ రీ షెడ్యూల్ చేసి, నూతన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేయాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం
Recent Comments