Sunday, November 24, 2024
Homeతెలంగాణకాలు జారిపడిన కేసీఆర్

కాలు జారిపడిన కేసీఆర్

యశోద ఆసుపత్రిలో అడ్మిట్ 

 కాలుజారి పడటంతో విరిగిన తుంటి ఎముక

స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​ సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రిలో చేరారు. గురువారం అర్ధరాత్రి ఆయన కాలు జారి పడినట్లు సమాచారం. కాలికి పంచె తగలడంతో… కేసీఆర్ కాలు జారి పడినట్లు తెలుస్తోంది. ఎడమకాలి తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ఆయనను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. రాత్రి కొన్ని టెస్టులు చేసిన డాక్టర్లు, శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత మరిన్ని టెస్టులు చేస్తారని తెలిసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments