ఫ్లాష్.. ఫ్లాష్..
స్పష్టం చేసిన అధిష్టానం
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు. భారీ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 7వ తేదీన ఉదయం 10:28 గంటలకు సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుందని, అంతా టీమ్‌గా పని చేస్తారు అని కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఇక డిప్యూటీ సీఎంలు ఎవరనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Recent Comments