Friday, November 22, 2024
Homeరాజకీయంపశ్చిమ సైలెంట్..

పశ్చిమ సైలెంట్..

ఉద్యోగుల నియోజకవర్గంగా గుర్తింపు
ఓటరు మౌనంపై అభ్యర్థుల్లో టెన్షన్
బీఆర్ఎస్ కు గడ్డుకాలమే..
హస్తానికి అభ్యర్థి మైనస్..
బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులపై మరకలు
ప్రత్యామ్నాయం వైపు చూపు..
రావు పద్మకు కలిసి రానున్న ఓటు
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: పశ్చిమ నియోజకవర్గ మౌనం.. అభ్యర్థుల్లో వణుకుపుట్టిస్తోంది. ఉద్యోగులంతా కేంద్రీకృతమైన ఈ ప్రాంతంలో ఓటు ఎవరి వైపు మళ్లుతుందోననే ఆందోళన నెలకొంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఆ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ కు ఇబ్బందిగా మారనుంది. ఇక నియోజకవర్గంలో హస్తం అనే మౌత్ టాక్ నడుస్తున్నా.. అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి మైనస్ కావడంతో ఆ పార్టీకి గెలిచే హోప్ లేకుండా పోయింది. దీంతో పాటు.. దాస్యం, నాయినిపై భూ కబ్జాలనే మరక ఉండడంతో పశ్చిమ ఓటర్లు వీరికి వైపు చూసేందుకు సముఖంగా లేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉన్న ప్రధాన అభ్యర్థి బీజేపీ పార్టీకి చెందిన రావు పద్మనే మధ్యే మార్గంగా చూస్తున్నారంటున్నారు. ఆడబిడ్డ కావడంతో పాటు.. ఎలాంటి అవినీతి, ఆక్రమాలు మరకలు లేకపోవడంతో వారు రావు పద్మ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
ప్రశాంత రాజకీయాల కోసం..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అంటేనే ఉద్యోగులు ఉండే ప్రాంతంగా గుర్తింపు. అంతేకాదు సంపన్నులు సైతం నివసిస్తుంటారు. ఇక్కడ ప్రతీ ఎన్నికలో ఓటింగ్ శాతం తక్కువగా జరుగుతుంటుంది. వీరంతా ఎప్పుడు ప్రశాంత రాజకీయాలను కోరుకుంటుంటారు. అలాగే ప్రతీ అభ్యర్థి తీరును నిశితంగా పరిశీలిస్తుంటారు. ఈక్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను వ్యక్తిగత, పార్టీలను అంచనా వేసి ఓటుతో తీర్పు చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈసారి రౌడీ, కబ్జాల రాజకీయాన్ని పక్కకు పెట్టి క్లీన్ పొలిటికల్ లీడర్ కు అవకాశం ఇవ్వాలనే యోచనలో పశ్చిమ ఉన్నట్లు చర్చ సాగుతోంది.
బీఆర్ఎస్ కు గడ్డు కాలమే..
బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ ఎఫెక్ట్ ఆ పార్టీ పశ్చిమ అభ్యర్థి దాస్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఎదురులేని నాయకుడిగా వస్తున్న దాస్యంకు ఈసారి ఓటమి తప్పదనే చర్చ సాగుతోంది. దాస్యం కోటకు బీటలు తప్పవని, ఓటరు మౌనం, సైలెంట్ ఓటింగ్ తప్పనిసరిగా అధికార పార్టీని పవర్ లేకుండా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
హస్తానికి అభ్యర్థి మైనస్..
రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ నడుస్తోంది అనేది ముమ్మాటికి నిజం. అయితే పశ్చిమలో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి మైనస్ గా రాజకీయ విశ్లేషకులే కాదు.. ఆ పార్టీ నేతలు సైతం చెబుతున్నారు. ఇప్పటికే జంగా నాయిని చరిత్రను బట్టబయలు చేసి.. ప్రజలకు అభ్యర్థిపై ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం జంగా ఆపార్టీలోనే ఉన్నా.. నాయినికి సహకరిస్తాడా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఇక నాయినిపై అనేక ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. తన రాజకీయ జీవితంలో తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని చెప్పుకుంటున్న నాయిని ప్రచారాన్ని పూర్తి్స్థాయిలో చేయలేదనే అపవాదు మోస్తు్న్నాడు. అంతేకాదు.. తమ ఏరియాకు పిలిచినా రాలేదని, ఇప్పుడే ఇలా ఉంటే గెలిస్తే ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది.
మధ్యే మార్గంగా బీజేపీ
పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల్లోని రెండు పార్టీల అభ్యర్థులపై పశ్చిమ ఓటర్లు విముఖత చూపిస్తుండడం, మధ్యే మార్గంగా బీజేపీ అభ్యర్థి రావు పద్మ కనిపిస్తుండడంతో ఆమె విజయం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. ఆడబిడ్డ కావడం, భూ కబ్జాలు, సెటిల్ మెంట్లు, అక్రమాలు లేకపోవడంతో ఆమె వైపు ఓటర్లు చూస్తున్నారనే చర్చ సాగుతోంది. అలాగే ఉద్యోగులు సైతం రెండు బీఆర్ఎస్, కాంగ్రెస్ లను కాదని బీజేపీని గెలిపించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రావు పద్మ గెలిస్తే ప్రశాంత రాజకీయం వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మేధావుల నియోజకవర్గంగా ఉన్న పశ్చిమ మరి ఎవరికి పట్టం కడుతుందో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments