5.4 కిలోల బంగారం సీజ్
కొమ్మళ్ల టోల్‌ప్లాజా వద్ద స్వాధీనం
స్పాట్ వాయిస్, బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మళ్ల టోల్‌ప్లాజా వద్ద సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న 5.4 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 3.09 కోట్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. సరైన పత్రాలు చూపించనందునే బంగారాన్ని సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.
Recent Comments