Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుసంక్షేమ పాలన కేసీఆర్‌కే సాధ్యం..

సంక్షేమ పాలన కేసీఆర్‌కే సాధ్యం..

సంక్షేమ పాలన కేసీఆర్‌కే సాధ్యం..

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్..

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

స్పాట్ వాయిస్, సంగెo: సంక్షేమ పాలన సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంగెo మండలం నర్సనగర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఈసందర్భంగా వారికి ఎమ్మెల్యే చల్లా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం చల్లా మాట్లాడుతూ… సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, పరకాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. వారంటీ లేని 6 గ్యారంటీల పత్రాలతో వచ్చే కాంగ్రేస్ పార్టీని నమ్మి మోసపోవద్దని సూచించారు.బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో, సీ ఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి,సంక్షేమం చూసి ఆకర్షితులమయ్యే బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు పార్టీలో చేరిన పలువురు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. నర్సానగర్ గ్రామాన్ని ఒక్కాతాటికి తీసుకొచ్చి ఏకగ్రీవ తీర్మానం చేస్తామని తెలిపారు.

 

పార్టీలో చేరింది వీరే

కాంగ్రేస్ గ్రామ పార్టీ అధ్యక్షులు జాటోతు దేవా,సీనియర్ నాయకులు జాటోతు భద్రయ్య, వార్డు మెంబర్లు జాటోతు రమేష్, పాండు, నాయకులు జాటోతు శంకర్, వెంకన్న, అజ్మీరా రవి,గుగులోతు సమ్మయ్య,జాటోతు జనార్దన్,తిరుపతి,అనుముల రాజు,రొట్టి మల్లేశం,ఉండిలా బిక్షపతి,వేణు,జాటోతు కిషన్,బుక్క మల్లయ్య,రొట్టి సతీష్,ఆవునూరి సదయ్య,బుక్క శ్రీను,రొట్టె స్వామి,ఓదెల ముత్యాలు,ఉండాలా భాస్కర్,ఓదెల రాజమౌళి,కె ప్రశాంత్,కె రాజేందర్ లతో పాటు పలువురు చేరారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి,మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి,వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య,సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి,మండల నాయకులు ఉండీల రాజు, మల్లయ్య, సర్పంచులు జాటోతు చత్రునాయక్, బొల్లెబోయిన కిశోరె యాదవ్, జాటోతు రాకేష్, రాజేందర్, రామ్మూర్తి, గ్రామ అధ్యక్షులు పెద్దపెల్లి వెంకటరాజ్యం, జాటోతు బాసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments