రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇండస్ట్రియల్ మేనేజర్
స్పాట్ వాయిస్, క్రైమ్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం ఏసీబీ అధికారుల దాడులు కలకలం సృష్టించాయి. జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్ వద్ద ఇండస్ట్రియల్ మేనేజర్ గంగాధర శ్రీనివాస్ రూ.15000 లంచం తీసుకుంటుండగా అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా రూ. 53 లక్షలకు ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గుగులోతు లచ్చీరాం గత సంవత్సరం అశోక్ లేలాండ్ వాహనాన్ని చేశారు. ఇందుకు సంబంధించి సబ్సిడీ కోసం లచ్చీరాం కొద్ది రోజుల క్రితం జిల్లా పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్ లచ్చీరాం నుంచి మొదట రూ. 50 వేలు తీసుకున్నాడు. అనంతరం మళ్లీ రూ. 60 వేలు కావాలని డిమాండ్ చేయడంతో లచ్చీరాం ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో గురువరం లచ్చీరాం రూ. 15వేలు ఇస్తుండగా జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
భూపాలపల్లిలో ఏసీబీ కలకలం..
RELATED ARTICLES
Recent Comments