ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటాం..
కాంగ్రెస్ పార్టీ మహిళ అధికార ప్రతినిధి, ఉత్తరప్రదేశ్ ఎంపీ డాలి శర్మ
స్పాట్ వాయిస్, దుగ్గొండి: మర్రి ప్రవళిక ఆత్మహత్యపై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మహిళ అధికార ప్రతినిధి ఉత్తరప్రదేశ్ ఎంపీ డాలి శర్మ , ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ రియాజ్, టీపీసీసీ అధికార ప్రతినిధి స్వప్న రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆదేశాల మేరకు వారు నర్సంపేట కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో దుగ్గొండి మండలం బిక్కాజి పల్లిలోని ప్రవళిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యార్థి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మర్రి ప్రవళిక కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పరిహారం ప్రకటించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మర్రి ప్రవళిక తల్లిదండ్రులతో రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, ఏఐసీసీ మెంబర్ దొంతి మాధవరెడ్డి రెడ్డి మాట్లాడుతూ.. మర్రి ప్రవళిక హత్య ముమ్మాటికి ప్రభుత్వం ప్రభుత్వ తప్పిదమని, వారి కుటుంబాన్ని ఆదుకోకుండా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను సరికాదన్నారు. వారి యొక్క కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Recent Comments