అల్లాహ్ దీవెనలు అందరిపై ఉండాలి
వ్యాపారవేత్త ఎస్ ఎం హుస్సేన్
ఇనుగుర్తిలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
స్పాట్ వాయిస్, కేసముద్రం : ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త అని, అల్లాహ్ దీవెనలు రాష్ట్రంపై ఉండి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రముఖ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త ఎస్ ఎం హుస్సేన్ అన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గురువారం ఇనుగుర్తి మండల కేంద్రంలో ఎస్ ఎం హుస్సేన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. తెలిపారు. అనంతరం ఇనుగుర్తి మండల కేంద్రం యాదవ బజారులోని పీరీల మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ ఎం హుస్సేన్ మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను సోదరభావాన్ని బోధించారని గుర్తు చేశారు. వారి మార్గంలో పయనిస్తూ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థించాలని సూ చించారు. మహమ్మాద్‌ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ వారి బోధనలు సార్థకం చేయాలని కోరారు. ముహ్మద్ ప్రవక్త దేవుని నుంచి వచ్చిన దూత అని ముస్లింలు నమ్ముతారాని, దయ, ధర్మ బంధమైన జీవితాలను ఎలా జీవించాలో ప్రజలకు చూపించడానికి ముహమ్మద్ ను అల్లాహ్ పుట్టించాడని విశ్వసిస్తూ ఈ పండుగను జరుపుకుంటామన్నారు నేడు ఆయన జన్మదినం సందర్భంగా అల్లాహ్ దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మతపెద్దలు, కమిటీ సభ్యులు ఎండీ నబీ సాహెబ్, న్యాయ సదర్ ఎండీ రహీం, ఇమామ్, యాకూబ్ పాషా, మెహబూబ్, భాషా, కాజా, వజీర్, సలీం, అమీర్, జావీద్, ఖాన్, జల్పకర్, జుల్వాకర్, బబ్లు, మోనో, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
అల్లాహ్ దీవెనలు అందరిపై ఉండాలి
RELATED ARTICLES
Recent Comments