ముమ్మరంగా రేషన్ కార్డు ఈకేవైసీ
లబ్ధిదారులు త్వరగా ఈ కేవైసీ చేయించుకోవాలి
హన్మకొండ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సామల మల్లయ్య
స్పాట్ వాయిస్, శాయంపేట : రేషన్ కార్డులో పేరున్న ప్రతీ ఒక్కరూ కేవైసీ (నో యువర్ కస్టమర్) చేయాలని అధికారుల సూచనలు మేరకు లబ్ధిదారులంతా డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈ మేరకు శాయంపేట మండల పరిధి కొప్పులతోపాటు మిగిలిన అన్ని గ్రామాల్లోని లబ్ధిదారులంతా స్థానిక రేషన్ షాపుల వద్దకు వెళ్లి వేలిముద్రలు ఇచ్చి కేవైసీ పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, శాయంపేట మండల అధ్యక్షుడు సామల మల్లయ్య గురువారం మండల పరిధిలోని డీలర్లతో సమావేశం నిర్వహంచారు. డీలర్లు తమ పరిధిలోని లబ్ధిదారుల వేలిముద్రలు త్వరితగతిన తీసుకోవాలని మండలంలోని డీలర్లకు సూచించారు. రేషన్ కార్డు దారులను ఆధార్ వివరాలతో పోల్చి చూసి అసలైన లబ్ధిదారుల వివరాలను ఆన్ లైన్లో పొందుపర్చనుందని ఆయన వెల్లడించారు. అలాగే ఏ ఊరికి చెందినవారైనా సరే ఏ ప్రాంతంలో వీలైతే అక్కడి రేషన్ దుకాణానికి వెళ్లి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చనే విషయాన్ని వివరించాలన్నారు. అయితే సర్వర్ ప్రాబ్లమ్ వల్ల లబ్దిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, టెక్నికల్ సమస్యను సంబంధిత అధికారులు త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు.
ముమ్మరంగా రేషన్ కార్డు ఈకేవైసీ
RELATED ARTICLES
Recent Comments