Friday, November 22, 2024
Homeరాజకీయంరాజయ్య.. కడియం కలిసిపోయారు

రాజయ్య.. కడియం కలిసిపోయారు

రాజయ్య.. కడియం కలిసిపోయారు

రాజయ్యకు కీలక హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్

కడియం గెలుపు కోసం పని చేస్తానని ప్రకటన 

స్పాట్ వాయిస్, ఓరుగల్లు: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.బీఆర్ ఎ స్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి సీటు ఖరారు చేయడంతో నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. సమయం దొరికిన ప్రతీసారి శ్రీహరిని టార్గెట్ చేస్తూ రాజయ్య సెటైర్లు వేశారు. పరోక్షంగా శ్రీహరిని ఓడిస్తా అనే రేంజ్ వరకు వెళ్లారు. ఈనేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్లో రాజయ్య, శ్రీహరితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో రాజయ్య శాంతించారు. వచ్చే ఎన్నికల్లో కడియం గెలుపునకు పార్టీ కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

 

రాజయ్యకు కీలక హామీ

రాజయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ మంత్రి కేటీఆర్ కీలక హామీ ఇచ్చారు. రాజయ్య భవిష్యత్త్ కు సీఎం కేసీఆర్, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక, కేటీఆర్ భరోసాతో రాజయ్య మెత్తబడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాని తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments