Saturday, November 23, 2024
Homeజాతీయంచంద్రబాబును చంపేందుకు కుట్రలు..

చంద్రబాబును చంపేందుకు కుట్రలు..

జైల్లో ఆయనకు భద్రత లేదు..
సోషల్ మీడియాలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
స్పాట్ వాయిస్, బ్యూరో: ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును అంతం చేసేందుకే అక్రమంగా అరెస్ట్ చేయించాడని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఆయనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘‘చంద్రబాబు గారిని సైకో జగన్ అక్రమ అరెస్ట్ చేయించారు, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది.‌ బాబు గారికి జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీ బారినపడి మరణించాడు. బాబు గారికి ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత’’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments