బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య
స్పాట్ వాయిస్, డెస్క్: బిచ్చగాడు ఫేమ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె లారా (16) ఆత్మహత్య చేసుకుంది. ఆమె చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద వార్త తో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ దుఃఖ సాగరంలో మునిగింది. సక్సెస్ ఫుల్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందో ఎవరికీ అర్ధం కావట్లేదు. తెల్లవారుజామున ఇంట్లో వాళ్ళు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా.. వెంటనే హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని సమాచారం అందింది. దీంతో విజయ్ ఆంటోని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకుంటున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు.. లారాకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Recent Comments