స్పాట్ వాయిస్, నల్లబెల్లి : పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడడమే మా లక్ష్యమని లెంకలపల్లి గ్రామబీఆర్ ఎస్ అధ్యక్షుడు కొత్తపల్లి అశోక్ అన్నారు. లెంకాలపల్లి, అనుములోని పల్లి, కస్తూరి పల్లి గ్రామాల నుంచి 50 కుటుంబాలను గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపెళ్లి అశోక్ ఆధ్వర్యంలో నర్సంపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. లెంకాలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రెండో కుల పెద్దమనిషి నత్తి లింగయ్య, నత్తి ఐలయ్య నత్తి సారయ్య, మంద ఉప్పలమ్మ, కన్నం నర్సయ్యల కుటుంబ సభ్యులతోపాటు బండి రమేష్, వీరబోయిన శీను, మాలగాని సాంబయ్య, బండి శీను, తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సొసైటీ అధ్యక్షుడు పప్పు రేణు కుమార్, గ్రామ పార్టీ అధ్యక్ష,కార్యదర్శులు కొత్తపెళ్లి అశోక్, మామిండ్లపల్లి రాజు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు బోయిని పోశాలు, ఉప సర్పంచ్ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ కోమండ్ల సుధాకర్, సోనబోయిన సుధాకర్, దళిత బంధు నాయకులు బొమ్మ కంటి అనిల్ తో పాటు అనేకమంది బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Recent Comments