Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుమోడీ నాయకత్వాన్ని బలపరుద్దాం

మోడీ నాయకత్వాన్ని బలపరుద్దాం

మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
దుగ్గొండి లో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు
స్పాట్ వాయిస్, నర్సంపేట (దుగ్గొండి) : రాష్ట్రంలో మోదీ నాయకత్వాన్ని బలపరిచి బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ జన్మదినం సందర్భంగా దుగ్గొండి మండలం గిర్నిబావిలో కార్యకర్తలు, నాయకులతో కలిసి రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ సుపరిపాలన, పేద ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు వంటి నినాదాలతో మోడీ కొనసాగుతున్నారని కొనియాడారు. రూ 1.08 లక్షల కోట్లతో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రతి గ్యాస్ సిలిండర్ పై రూ.400 తగ్గింపుతో రూ.9.6 కోట్ల లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిందన్నారు. తెలంగాణ రైతాంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.6300 కోట్లతో పునరుద్ధరించారని చెప్పారు. రూ.774 కోట్లతో మెరుగైన నీటి యాజమాన్య పద్ధతులు, నీటిపారుదల రంగానికి రూ.1248 కోట్ల కేటాయింపు, హైదరాబాద్ కేంద్రంగా తృణధాన్యాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన, అభివృద్ధి కోసం రూ.200 కోట్లు వెచ్చించారని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులకు పెద్దపీట వేసి ముద్ఖేడ్-ధోన్ డబ్లింగ్ విద్యుదీకరణ పనులకు అంగీకారం, గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపారన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments