సంతాప సభలో సిరికొండ ప్రశాంత్
రమేష్ కు ఘనంగా నివాళులర్పించిన గులాబీ శ్రేణులు
స్పాట్ వాయిస్, గణపురం: బీఆర్ఎస్ మండల యూత్ మాజీ అధ్యక్షుడు గొర్రె రమేష్ మృతి పార్టీకి, సిరికొండ కుటుంబానికి తీరనిలోటని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్ అన్నారు. రమేష్ ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా ఆదివారం మైలారం గ్రామంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సిరికొండ ప్రశాంత్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి రమేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిరికొండ ప్రశాంత్ మాట్లాడుతూ..రమేష్ మృతి తీవ్రంగా కలచివేసిందని కన్నీరు పెట్టుకున్నారు. రమేష్ మరణవార్త విని షాక్ అయ్యామని చెప్పారు. 2001లో రమేష్ తనకు పరిచయమయ్యారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమ కాలంలో పార్టీ పట్ల, పార్టీ ఆశయాల పట్ల పూర్తి అంకితభావంతో పని చేశారని కొనియాడారు. రమేష్ కుటుంబానికి సిరికొండ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమం మొత్తం అంతా తానై సిరికొండ ప్రశాంత్ చూసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసిలు, సిరికొండ యవసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
గొర్రె రమేష్ మృతి పార్టీకి తీరనిలోటు
RELATED ARTICLES
Recent Comments