ప్రైవేటు ఆస్పత్రిలో చేరిక
విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ జాగ్రత్త
స్పాట్ వాయిస్, కేసముద్రం : ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ లో వాచ్ మెన్ (అటెండర్)గా పనిచేస్తున్న మేడవరపు స్వరూప ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓవర్ డ్యూటీలు వేయడం, వ్యక్తిగత పనులు చేయించుకోవడం, అనారోగ్యంతో ఉన్నా సెలవు కావాలంటే ఇవ్వకుండా స్వరూపను ప్రిన్సిపాల్ ఒత్తిడికి గురి చేసేవాడని, దీంతో ఆయన వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. విషయం బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమెను తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకోగా విషయాన్ని బయటకు రానీయకుండా ప్రిన్సిపాల్ సిబ్బందిని బెదిరించినట్లు సమాచారం. ఈ విషయంపై బాధిత కుటుంబసభ్యులు కేసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Recent Comments