బిగ్ న్యూస్..
శుక్రవారం హాజరుకావాలంటూ ఆదేశం
స్పాట్ వాయిస్, బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మళ్లీ హాట్ హాట్ టాపిక్ గా నిలిచింది. బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ పరిణామంతో.. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మళ్లీ పతాక శీర్షకకు చేరింది. శుక్రవారం ఢిల్లీలో హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. గత మార్చిలో మూడు సార్లు ఈడీ ముందు కవిత హాజరయ్యారు. ఆ తరువాత ఈడీ కేసు స్తబ్దుగా మారింది. ఇటీవల అరుణ్ రామచంద్రన్ పిళ్లై అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. 164 కింద ఈడీ అధికారులకు పిళ్లై వాంగ్మూలం ఇచ్చారు. పిళ్లై దగ్గర నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్ పిళ్లైపై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు సౌత్ గ్రూపులోని సభ్యులు అప్రూవర్‌గా మారింది. అప్రూవర్‌గా మారిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై, మాగుంట శ్రీనివాసరెడ్డి , ఆయన కుమారుడు రాఘవరెడ్డి శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కవితకు మళ్లీ ఈడీ నోటీసులు
RELATED ARTICLES
Recent Comments