Saturday, November 23, 2024
Homeక్రైమ్మరదలిపై మోజుతో..

మరదలిపై మోజుతో..

భార్యను హతమార్చిన భర్త
జయశంకర్ జిల్లాలో ఘటన
నిందితుడిని రిమాండ్ కు పంపిన పోలీసులు
స్పాట్ వాయిస్, గణపురం: మరదలిపై మోజుతో భార్యను హత్యను చేసిన ఘటన గణపురం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గొల్లపల్లికి చెందిన జక్కుల శారద ఏప్రిల్ 24వ తేదీన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో శారద తండ్రి జూజరి ఐలయ్య ఫిర్యాదు మేరకు గణపురం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చిట్యాల సీఐ బృందాలుగా ఏర్పరిచి నేరస్తుడు జక్కుల కుమారస్వామి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జక్కుల కుమారస్వామి సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు ఒక పెద్ద మనిషిని వెంట తీసుకొని వచ్చి తాను చేసిన నేరం ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య గర్భిణీగా ఉన్న సమయంలో తన మరదలు ఇంటికి రాగా తనతో వివాహేతర సంబంధం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో మరదలితో ఉండాలని తానే తన భార్యని చంపానని చెప్పాడు. భార్య అనారోగ్యం కారణంగా చనిపోయినట్లు సృష్టించానని తెలిపారు. నిందితుడు నేరాన్ని ఒప్పుకోవడంతో చిట్యాల సీఐ వేణుచందర్ అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. సీఐ వెంట గణపురం ఎస్సై మచ్చా సాంబమూర్తి ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments