కేయూ వైస్ చాన్స్‌లర్ తాటికొండ రమేష్‌కు విద్యార్థి జేఏసీ నేతల సవాల్
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ తాటికొండ రమేష్ కేయూ వైస్ చాన్సలర్ గా నియామకం అయినప్పటి నుంచి నేటి వరకు పీహెచ్ డీ కేటగిరి-1, కేటగిరి-2 అడ్మిషన్లలో, పాలనాపరమైన పదవులు కట్టబెట్టడంలో, ఫీజుల పెంపు విషయంలో, అభివృద్ధి పేరిట జరిగిన అవినీతి, అక్రమాలపై ధైర్యం ఉంటే సీనియర్, రిటైర్డ్ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలు, మేధావుల సమక్షంలో కేయూ వీసీ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేయూ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు సవాల్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ లోని ఎస్డీఎల్ సీఈ ఎదురుగా పీహెచ్ డీ కేటగిరి -2 అడ్మిషన్లలో జరిగిన అవకాతవకలపై విచారణ జరిపి, అర్హులైన వారికి న్యాయం చేయాలని, విద్యార్థి సంఘ నాయకుల పై దాడి చేసిన పోలీస్ అధికారులను ఉద్యోగం నుంచి తొలగించాలని, విద్యార్థులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్ష ఆదివారంతో ఐదో రోజుకు చేరింది. ఈసందర్బంగా విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కొట్టడం దారుణమన్నారు. కేయూలో జరుగుతున్న అక్రమాలపై వీసీ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే ఆంధ్ర ప్రాంతానికి చెందిన రిజిస్ట్రార్ ను, అక్రమాలకు పాల్పడుతున్న వీసీ ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల దీక్షకు హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, వన్నాల వెంకటరమణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కేయూ విద్యార్థి జేఏసీ వ్యవస్థాపకుడు డాక్టర్ మంద వీరస్వామి, డాక్టర్ బుర్రి ఉమాశంకర్, కుర్సా అధ్యక్షుడు తాళ్లపెల్లి నరేష్ గౌడ్, ఎం ఎస్ ఎఫ్ జిల్లా ఇంచార్జీ మంద భాస్కర్ లు మాట్లాడారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థి సంఘ నాయకులు మాచర్ల రాంబాబు, అంకెల శంకర్,ఆరేగంటి నాగరాజుల ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు, ట్రైబల్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్, పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహ రావు, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్, ఎన్ఎస్ యూఐ పాష, కాశి, ఎంఎస్ఎఫ్ కేయూ ఇన్చార్జి వడ్డెపెల్లి మధు, కేతపాక ప్రసాద్, అభిరామ్, రమేష్, కందికొండ తిరుపతి, వికలాంగుల ఫోరమ్ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, ఏబీవీపీ కేయూ ఇన్చార్జి నిమ్మల రాజేష్, ఏబీవీపీ వరంగల్, హన్మకొండ సంఘటన బాధ్యులు, హర్షవర్ధన్, నిఖిల్, భరత్, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments