స్పాట్ వాయిస్, టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఆశిరెడ్డిపల్లె శివారు చలివాగులో గల్లంతైన భవాని మృతదేహం లభ్యమైంది. పంగిడి పల్లి గ్రామానికి చెందిన భవాని శనివారం చేపల వేటకు వెళ్లగా.. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న కొడుకును రక్షించబోయి గల్లంతైన విషయం తెలిసిందే. కాగా భూపాలపల్లి ఎస్పీ పుల్ల కరుణాకర్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు, డిజిస్ట్రార్ ఆప్సాన్స్ ఫోర్స్ టీంలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా గుమ్మడివెల్లి, వెలిశాల గ్రామాల మధ్య ఉన్న చెక్ డ్యాం సమీపంలో భవాని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. వెలికి తీసిన మృతదేహాన్ని చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు.
Recent Comments