20 నుంచి దరఖాస్తుకు ఛాన్స్
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు… ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 20 నుంచి అక్టోబరు 21 వరకు టీఆర్టీ దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరు 20 నుంచి 30 వరకు ఆన్లైన్ చేసుకోవచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ టీఆర్టీ ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే సంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ.. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో టీఆర్టీ ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత నెల 25న 5,089 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందుకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్ఓటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు తగిన సమాచారం వెబ్ సైట్ లో పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. టీఆర్టీ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 20 నుంచి ప్రారంభమై.. అక్టోబరు 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లోనే చేయాలి. రాతపరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. అప్లికేషన్ ఫీజు రూ.1000గా నిర్ణయించారు. ఇంకా పూర్తి సమాచారాన్ని దిగువన ఇవ్వడం జరిగింది.
టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
RELATED ARTICLES
Recent Comments