జనగామలో ముదిరిన వార్
పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు
స్పాట్ వాయిస్, జనగామ: జనగామ వార్ రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే యుద్ధవాతావరణం నెలకొనగా.. ఏ నిమిషానికి ఏమవుతుందోననే టెన్షన్ లో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ప్రస్తుతం జనగామలో ముత్తిరెడ్డి, పల్లా, పోచంపల్లి వర్గాలుగా బీఆర్ఎస్ వీడిపోయి ఉంది. అయితే పల్లా తనకే టికెట్ కన్ఫాం అంటూ జనగామలో చక్రం తిప్పుతున్నాడు. ఈక్రమంలో ముత్తిరెడ్డి వర్గీయులపై కేసులు పెడుతున్నారంటూ శనివారం వారు రోడ్డెక్కారు. స్వయంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగారు. దళిత ద్రోహి పల్లా రాజేశ్వర్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే రోడ్డుపై షర్ట్ విప్పిన అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి దళితులపై కేసులు పెట్టించాడంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వెంటనే జనగామ రాజకీయాలపై స్పందించాలని లేకపోతే.. పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
Recent Comments