Tuesday, November 26, 2024
Homeరాజకీయంఇనగాలకే పరకాల టికెట్ ఇవ్వాలి...

ఇనగాలకే పరకాల టికెట్ ఇవ్వాలి…

 పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల డిమాండ్..
ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలంటూ దరఖాస్తు అందజేత
స్పాట్ వాయిస్, బ్యూరో: పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పేరు మొదటి లిస్టులోనే ప్రకటించాలని నియోజకవర్గంలోని పలు మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్ లో పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని ప్రకటించాలని నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, జిల్లా నాయకులు దరఖాస్తును సమర్పించారు. ఇందులో టీపీసీసీ ఎలక్షన్ కమిటీ అధికారికి పూర్తి వివరాలు, ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పార్టీ కోసం చేసిన కృషి, కార్యకర్తలకు, ప్రజలకు చేసిన సేవ కార్యక్రమాలను దరఖాస్తు రూపంలో నమోదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఇనగాలకు అన్ని రకాలుగా అర్హత ఉందని, ఆయనకు అవకాశం కల్పించాలని కోరారు. ఇనగాల వెంకట్రామ్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే పరకాల నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వస్తుందని చెప్పారు. నియోజవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తారాని, నిరుద్యోగం రూపు మాపి రాజకీయాల్లో కొత్త అర్థం చూపుతారాని పేర్కొన్నారు. పరకాల నియోజవర్గంలో అభివృద్ధి శూన్యత,రాజకీయ అస్థిరతకు ఇక్కడి నాయకులే కారణమని, కనీస సౌకర్యాలు లేని గ్రామాలు తండాలు ఎన్నో ఇంకా ఉన్నాయని, విద్యా వైద్యానికి ఇంకా దూరంగా ఉన్నా తామే గొప్ప నాయకులమని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గం నుంచి ఎంతమంది టికెట్ ఆశించిన స్థానిక నాయకుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డికే టికెట్ వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

12ఏళ్ల నుంచి పార్టీ కోసం..
పరకాల నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు ఇనగాలకు ఉన్నాయని, 12ఏళ్ల నుంచి ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా పని చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వారిని కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. ఇనుగాలకు టికెట్ కేటాయిస్తేనే బీఆర్ఎస్ ను నిలువరించే అవకాశం ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ధరఖాస్తు సమర్పించిన వారిలో పీసీసీ కోఆర్డినేటర్ బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, జిల్లా నాయకులు చాడ కొముర రెడ్డి, కొండేటి కొముర రెడ్డి, పరకాల మండల సీనియర్ నాయకులు నాలుబల కృష్ణన్న, సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చోల్లేటి మాధవరెడ్డి, ఆత్మకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమలాపురం రమేష్, పరకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, గుడెప్పాడు ఎంపీటీసీ బీరం రజినీకర్ రెడ్డి, నడికూడ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్, గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్, దామెరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ అధ్యక్షుడు ఎలగొండ ప్రవీణ్ ,17వ డివిజన్ అధ్యక్షులు వేణుగోపాల్, నడికూడ మండల ప్రధానకార్యదర్శి డా.మలహాల్ రావు, పరకాల యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు గుండాల క్రాంతి, ఇనగాల యువ సేన గౌరవ అధ్యక్షుడు బొమ్మతి చంద్రపాల్, ఆత్మకూరు మాజీ సర్పంచ్ సామెల్, పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments