ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
ఒకరి మృతి.. మరొకరి గాయాలు
స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపురం) : బైక్ ను కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలం మంగళవారి పేటలో గురువారం జరిగింది. ఎస్సై మాధవ్ గౌడ్ కథనం ప్రకారం.. ఖానాపూర్ మండలం నాజీ తండా గ్రామానికి చెందిన సభావత్ బద్రు, అజ్మీర భిక్ష (81) ద్విచక్ర వాహనంపై నర్సంపేట వైపునకు వస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారిపేట వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో భిక్షను అక్కడనుండి వరంగల్ ఎంజీఎం కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య వీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవ్ తెలిపారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
RELATED ARTICLES
Recent Comments