గోదావరి ఒడ్డున గుర్తు తెలియని మహిళ మృతదేహం
వరద ప్రభావిత ప్రాంతాల్లో అలుముకున్న విషాదం..
తమవారిదేనా.. అంటు కన్నీళ్లు
స్పాట్ వాయిస్, ములుగు: గోదావరిలో మృతదేహం.. అంటే.. ఇప్పుడు వరద ప్రభావిత గ్రామాలు ఉలిక్కి పడుతున్నాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. భూపాలపల్లి జిల్లాలో మోరంచపల్లి, మానేరు పరివాహక ప్రాంతాలు, ఇటు ములుగు జిల్లాలోని అనేక గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఈ వరదల్లో మోరంచపల్లిలో నలుగురు కొట్టుకుపోగా.. ఒక మహిళ మృతదేహాం లభించలేదు. ఇక ములుగు జిల్లా కొండాయిలో కుటుంబం, వెంకటాపురం మండలం బూరుగుపేటలో మరో కుటుంబం కొట్టుకుపోయింది. ఇందులో కొంతమంది మృతదేహాలు వరద ఉధృతి తగ్గగానే లభించగా.. మరికొందరు ఆచూకీ లభ్యం కాలేదు. అయితే గోదావరి శాంతించడంతో.. తాజాగా బుధవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డున కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన కొంతమంది స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు ఆరెంజ్ కలర్ చీర, స్వెట్టర్ ధరించి ఉందన్నారు. ఆమె వయసు సుమారుగా 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో మోరంచ నుంచి.. మొదలుకొని.. కొండాయి వరకు విషాదం నెలకొంది. ఆ శవం తమవారిదే అయిఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మృతదేహం ఎవరిది..?
RELATED ARTICLES
Recent Comments