జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్
స్పాట్ వాయిస్, గణపురం: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం జయశంకర్ సార్ జయంతి సందర్భంగా పంచాయతీ కార్యాలయం ఆవరణలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక జయశంకర్ సార్ కృషి మరువలేనిదని కొనియాడారు. సార్ జీవితాన్ని ప్రతీవ్యక్తి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు గుర్రం తిరుపతిగౌడ్, ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు బోయిని సాంబయ్య ముదిరాజ్, యూత్ నాయకులు దివి వంశీ నాయుడు, వాజీద్, సాయిరాం, అభి, గౌతమ్, సందీప్, సోషల్ మీడియా కన్వినర్ హాఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments