Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుసార్  చిరస్మరణీయుడు 

సార్  చిరస్మరణీయుడు 

సార్  చిరస్మరణీయుడు 

ఎస్సై మచ్చ సాంబమూర్తి

స్పాట్ వాయిస్, గణపురం: తెలంగాణ ఏర్పాటే ‌లక్ష్యంగా , స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని ఎస్సై మచ్చ సాంబమూర్తి అన్నారు. ప్రొ.జయశంకర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక పోలీసు స్టేషనులో సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఆయన చేసిన త్యాగం, సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రాజేందర్, సందీప్, అశోక్, రాజు, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments