కొడుకును చంపిన తండ్రి
మానుకోటలో దారుణం
స్పాట్ వాయిస్, క్రైమ్: మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొర్రూరు డివిజన్ దంతాలపల్లి మండలం గున్నెపల్లి గ్రామంలో తండ్రి కొడుకును హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బత్తిని సురేష్ (35) తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తండ్రి – కొడుకుకు వాగ్వాదం జరిగింది. దీంతోఅగ్రహానికి గురైన తండ్రి కొడుకును కత్తితో పొడిచాడు. కొడుకు బత్తిని సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉపాధి కోసం వచ్చి…
తండ్రీకొడుకులది సూర్యాపేట జిల్లా కుక్కడం గ్రామం. మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొనడంతో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జీవనోపాధి కోసం గున్నేపల్లి వచ్చి ఉంటారని పోలీసులు తెలిపారు.మృతిచెందిన యువకుడిని పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Recent Comments