స్పాట్ వాయిస్, గణపురం: భారీ వరదకు కట్టు బట్టలతో రోడ్డున బడిన మోరంచపల్లి ముంపు నిర్వాసితుల బాధలు వర్ణనాతీతమని గణపురం వర్తక సంఘం సభ్యులు ఇమ్మడి వెంకటేశ్వర్లు అన్నారు. మండల వర్తక సంఘం ఆధ్వర్యంలో మోరంచపల్లి బాధితులకు సాయం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గాంధీనగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో మోరంచపల్లి బాధితుల పరిస్థితి చాలా దయానీయంగా ఉందన్నారు. మానసికంగా వారు ఎదుర్కొంటున్న బాధ వర్ణనాతీతమన్నారు. వరద బాధితులకు తమ వంతుగా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో పునరావాస కేంద్రంలో ఉంటున్న 200 మందికి భోజనం అందించేందుకు బియ్యం, వంట సామగ్రి తమ సంఘం ద్వారా తహసీల్దార్ సతీష్ కుమార్, ఎస్సై మచ్చ సాంబమూర్తికి అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్కూరి శ్రీనివాస్, దేసు ప్రదీప్, యాంసాని రాజు, బుక్క శీను, రేడియో షాప్ రవి, యాంసాని సుధీర్, టి. సురేష్, సంగేపు రవి, పోకల కృష్ణమూర్తి, కొండూరు ముక్తేశ్వర్, వెనిశెట్టి సదానందం, తదితరులు ఉన్నారు.
Recent Comments